ఎంపీపీల్లో గులాబీ గుబాళింపు..

315
trs mpps
- Advertisement -

మండల పరిషత్‌ అధ్యక్ష(ఎంపీపీ) పీఠాల్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. 536 స్ధానాల్లో 424 చోట్ల టీఆర్ఎస్ గెలుపొందింది. ఆరు జిల్లాల్లో కారు క్లీన్ స్వీప్ చేయగా 10 జిల్లాల్లో కాంగ్రెస్ ఖాతానే తెరవలేదు. టీఆర్ఎస్ టికెట్ దక్కక తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీచేసిన వారు తిరిగి సొంతపార్టీకే మద్దతివ్వడంతో గులాబీ పార్టీ అత్యధిక ఎంపీపీ స్ధానాలను దక్కించుకుంది.

కాంగ్రెస్ అభ్యర్థులు 60 మండలాల్లో, బీజేపీ 9 మండలాల్లో, ఇతరులు 11 మండలాల్లో అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. కోరం లేకపోవడంతో 26 మండలాల్లో ఎన్నిక వాయిదాపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిషత్ స్థానాలకు పదవీకాలం పూర్తికాకపోవడంతో ఎంపీటీసీ ఎన్నికలే జరుగలేదు.

పార్టీకి మొదటి నుంచి విధేయులుగా ఉంటూ వస్తున్నవారు, ఉద్యమంలో పనిచేసినవారు, ప్రజాభిమానం చూరగొన్నవారిని టీఆర్‌ఎస్ నాయకత్వం ఎంపీపీ అధ్యక్షులుగా ఎంపికచేసింది. కొన్నిచోట్ల సామాజిక సమీకరణాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు.ఇక ఇవాళ జడ్పీ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది.

- Advertisement -