అండమాన్‌ను తాకిన నైరుతి

162
niruthi
- Advertisement -

గుడ్ న్యూస్…ఈసారి వారం రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు పలకరించనున్నాయి, దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్, నికోబార్‌ దీవుల్లో ఎక్కువ భాగాలు, అండమాన్‌ సముద్ర ప్రాంతాన్ని సోమవారం రుతుపవనాలు తాకాయి. సాధారణంగా ఈ నెల 22న రుతుపవనాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించాల్సి ఉంది. కానీ అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా వారం ముందే ప్రవేశించాయి.

ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఉపరితలద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే ఈ నెల 20వ తేదీ వరకు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

- Advertisement -