కాంగ్రెస్‌ నేత నివాసంలో సీబీఐ సోదాలు

79
karthi chidambaram
- Advertisement -

మాజీ కేంద్రమంత్రి చిందంబరం తనయుడు,కాంగ్రెస్ నేత‌ కార్తీ చిదంబరం నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. కార్తీ చిదంబరం నివాసాలతో పాటు దేశవ్యాప్తంగా ఆయ‌న‌కు సంబంధించిన కార్యాయాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

ఢిల్లీ, ముంబై, చెన్నై, కర్నాటక, ఒడిశాతో పాటు తొమ్మిది ప్రాంతాల్లో సీబీఐ తనిఖీలు నిర్వహిస్తోంది. 2010-2014 మధ్యకాలంలో కార్తీ చిదంబరం విదేశాలకు నగదు తరలించారని ఆరోపణల నేప‌థ్యంలో సీబీఐ త‌నిఖీలు నిర్వ‌హిస్తోంది.

సీబీఐ దాడులపై కార్తీ చిదంబరం ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఇంకా ఎన్నిసార్లు సోదాలు చేస్తారు? ఇప్పటికీ ఎన్నిసార్లు ఇలా జరిగింది.. తప్పనిసరిగా రికార్డుండాలి అని పేర్కొన్నారు.

- Advertisement -