రాష్ట్రంలో జూన్‌ నుంచి వర్షాలు..

262
Monsoon 2020 in telangana from june 16th
- Advertisement -

రాజేంద్రనగర్‌లోని ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మధ్య భారతదేశం, తెలంగాణలో 2020 రుతుపవన ఆగమన అంచనాపై వెబినార్ నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, ప్రొ. జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ డా. వీ.ప్రవీణ్ రావు, జర్మనీకి చెందిన పాట్స్‌డామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లైమేట్ ఇంపాక్ట్ రిసెర్చ్ (పీఐకే) సంస్థ ప్రొ. ఎలెనా లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డా. వీ. ప్రవీణ్ రావు మాట్లాడుతూ.. మాన్ సూన్ ప్రిడిక్షన్ మనకు ముఖ్యమైనా సమాచారం. దీనిపై గత రెండు మూడేళ్లుగా జర్మనీకి చెందిన పాట్స్ డామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ సంస్థ పనిచేస్తోంది. గత సంవత్సరం పీఐకే ప్రిడిక్షన్ నిజమైంది. ఈ ఏడాది కూడా ఐఎండీతో పీఐకే ప్రిడిక్షన్ సరిపోలింది. జూన్ 16వ తేదీ నుంచి వర్షాలు పడతాయని జర్మనీ శాస్త్రవేత్తల అంచనా వేస్తున్నామన్నారు.

జూన్16 నుండి వారం రోజులు పడిన తర్వాత 15-20 రోజులు వర్షాలు పడవు. మళ్ళీ జూలై 16 నుంచి అక్టోబర్ 13వ తేదీ వరకు నిరంతరాయంగా వర్షాలు పడతాయని అంచనా. సమయానుకూలంగా రైతులకు, వ్యవసాయ శాఖకు సమాచారాన్ని అందిస్తాం. ఈ ఏడాది సాధారణంగా 854 మి. మి వర్షపాతం కురుస్తుందని అంచనా వేస్తున్నాం. ఈ ఏడాది విత్తన మేళా ఉండదు. రేపటి నుంచి ఆయా జిల్లాల్లో రైతులకు అందుబాటులో విత్తనాలు ఉంటాయి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నెం. 1800 1801 1551 నంబర్లలో సంప్రదించాలి అని డా. వీ. ప్రవీణ్ రావు సూచించారు.

- Advertisement -