మంకీపాక్స్‌..కేంద్రం కీలక ఆదేశాలు!

46
monkeypox
- Advertisement -

దేశంలో రెండు మంకీపాక్స్‌ కేసు నమోదుకావడంతో కేంద్రం అప్రమత్తమైంది. విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికుల విషయంలో కఠినంగా హెల్త్ స్క్రీనింగ్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ విషయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఇతర అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. అనుమానిత ప్రయాణికులు ఐసోలేషన్‌లో ఉంటూ, తగినంత దూరం పాటించేలా, దగ్గర్లో ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.

గతంలో ఆఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలోనే హెల్త్ స్క్రీనింగ్ నిర్వహించేవారు. అయితే, ఇప్పుడు ఇతర దేశాల ప్రయాణికుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించారు. అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరించి, పరీక్షలకు పంపే ఏర్పాట్లు చేశారు. అన్ని రాష్ట్రాలు, ఎయిర్‌పోర్టులు, పోర్టులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.

- Advertisement -