తొమ్మిదో మంకీపాక్స్ కేసు..

18
- Advertisement -

దేశంలో తొమ్మిదో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఢిల్లీలో ఉంటున్న నైజీరియన్ మహిళకు మంకీపాక్స్ సోకినట్లు అధికారులు తెలిపారు. ఇక ఢిల్లీలో ఇది నాలుగో కేసు కాగా దేశంలో మహిళకు మంకీపాక్స్‌ సోకడం ఇదే మొదటిసారి.

అయితే, ఆమె ఎక్కడెక్కడ పర్యటించిందో ఇంకా సమాచారం లేదు. మరోవైపు దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం, మంకీపాక్స్ లక్షణాలతో ఇటీవల ఒక రోగి మరణించడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు పలు సూచనలు జారీ చేసింది.

()వైరస్ సోకిన వ్యక్తులకు దూరంగా ఉండాలి
() రోగి తాకిన ప్రదేశాలను, వస్తువులను తాకకూడదు
() రోగికి దగ్గరగా ఉండే వాళ్లు శానిటైజర్, హ్యాండ్ వాష్, గ్లోవ్స్, మాస్క్ వంటివి వాడాలి
() రోగి ఉపయోగించిన లాండ్రీ, బెడ్‌షీట్స్, టవల్స్ వంటివి వాడకూడదు
() వ్యాధి లక్షణాలు కనిపిస్తే పబ్లిక్ ప్లేసులకు వెళ్లకూడదు

- Advertisement -