- Advertisement -
రోడ్డుపై కోతులు కనిస్తే కుక్కలు వాటిని తరిమికొడుతుంటాయి. కానీ ఇక్కడ విచిత్రం జరిగింది. కుక్క పిల్లకు వానరం పాలు ఇచ్చింది. కుక్క పిల్లకు కోతి పాలు ఇవ్వడం ఆశ్చర్యనికి గురి చేసింది.. ఆకలితో ఉన్న కుక్క పిల్లకు పాలిచ్చింది వానరం. చనుబాల కోసం వచ్చిన కుక్కకి అక్కడే నిలబడి పాలిచ్చింది. రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలం తడగొండలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.. అరుదైన దృశ్యాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
- Advertisement -