బొల్లినేని శ్రీనివాసగాంధీపై మనీలాండరింగ్ కేసు..

446
bollineni srinivasa gandhi
- Advertisement -

ఈడీ మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీపై మనీ ల్యాండరింగ్‌ కేసు నమోదైంది. మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌(ఈసీఐఆర్‌) దాఖలు చేశారు ఈడీ అధికారులు.భారీ ఎత్తున మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఈసీఐఆర్‌లో పేర్కొన్నారు.

జూలై 8న గాంధీపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు హైదరాబాద్,విజయవాడల్లోని ఆయన ఆస్తులపై దాడులు చేశారు. సీబీఐ కేసు ఆధారంగా గాంధీపై ఈడీ కేసు నమోదుచేసింది. 2010 నుంచి 2019 వరకు ఈడీలో పనిచేశారు శ్రీనివాస గాంధీ. 2010లో రూ. 21 లక్షలుగా ఉన్న ఆయన ఆస్తులు 2019 జూన్ 26 నాటికి ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.3.74 కోట్లకు పెరిగింది.బహిరంగమార్కెట్లో వీటి విలువ రూ. 200 కోట్లకిపైగా ఉంటుందని అంచనా వేశారు.

విజయవాడతో పాటు హైదరాబాద్‌లోని హైదర్ నగర్,కూకట్‌పల్లిలోని ఆయన నివాసాల్లో దాడులు చేశారు. పలు బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వలు,హైదరాబాద్‌లో ప్లాట్లు,స్థిరాస్తులు,కుటుంబసభ్యుల పేరిట ఆస్తులు,విలువైన ఆభరణాలు గుర్తించారు.

కేంద్రమాజీ మంత్రి సుజనా కేసులో భారీగా లబ్ది పొందినట్లు సీబీఐ గుర్తించింది. సుజనా జీఎస్టీ ఎగవేత కేసులో ఆయనకు అనుకూలంగా వ్యహరించారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు ఏపీలోని తుళ్లూరు,గుణదల,పెద్దపులిపాక,కన్నూరు,కంకిపాడు,పొద్దుటూరు,హైదరాబాద్‌లోనికొండాపూర్‌, మదీనాగూడ, కూకట్‌పల్లిలో స్థిరాస్తులు కూడబెట్టారు గాంధీ. ఈ నేపథ్యంలో గాంధీ అక్రమ ఆస్తుల్ని అటాచ్ చేయనున్న ఈడీ విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేయనుంది.

- Advertisement -