ఆసక్తిరేపుతోన్న నాని’ గ్యాంగ్ లీడర్’ టీజర్

481
Nani Gang Leader
- Advertisement -

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న సినిమా గ్యాంగ్ లీడర్. దర్శకుడు విక్రమ్ కుమార్.కె ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్నమైన కథతో ఈచిత్రాన్ని తెరకెక్కించారు విక్రమ్ కుమార్. ఈచిత్రాన్ని ఆగస్ట్ 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్. ఈసందర్భంగా ఇప్పటి నుంచే ఈచిత్ర ప్రమోషన్స్ ను ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం ఈచిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.

తాజాగా ఈమూవీ టీజర్ ను విడుదల చేశారు. పెన్సిల్‌, అత‌ని గ్యాంగ్ చేసే సంద‌డిని టీజ‌ర్‌లో చూపించారు. పెన్సిల్ పార్ధ‌సార‌ధి పాత్ర‌లో నాని న‌టిస్తుండ‌గా, ఆయ‌న ఫేమ‌స్ రివెంజ్ రైట‌ర్ అని ప‌రిచ‌యం చేసుకుంటాడు. టీజ‌ర్ ఆస‌క్తి రేకెత్తిస్తుంది.

ఈమూవీని మైత్రి మేకర్స్ సంస్ధ వారు నిర్మిస్తుండగా అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ఆర్ఎక్స్ 100ఫేమ్ హీరో కార్తీకేయ ఈసినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ నటించిన సాహో చిత్రం కూడా ఈనెల 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈనేపథ్యంలో గ్యాంగ్ లీడర్ విడుదల వాయిదా వేసుకుంటారో లేదా సాహోతో పోటీ పడతారో చూడాలి మరి. ఈ చిత్ర టీజర్ మీకోసం..

- Advertisement -