క్యాపిటల్‌పై దాడిని ఖండించిన ట్రంప్!

64
Trump

అమెరికా చట్టసభ క్యాపిటల్ హిల్‌ భవనంపై దాడిని ఖండించారు డోనాల్డ్ ట్రంప్. ప్రస్తుతం తన దృష్టంతా అధికార బదిలీపై ఉందని వెల్లడించిన ట్రంప్‌ ఈ దాడిని తాను వ్యతిరేకిస్తున్నానని వెల్లడించారు. క్యాపిటల్‌పై దాడి జరిగిన వెంటనే ఫెడరల్‌ సైన్యాన్ని రంగంలోకి దించినట్లు చెప్పారు.

అమెరికా ఎప్పటికి శాంతి భద్రతల దేశంగానే ఉంటుందని తెలిపిన ట్రంప్…బైడెన్ ఎన్నికను అమెరికా కాంగ్రెస్ దృవీకరించిందని చెప్పారు. దాడి జరిగిన వెంటనే చొరబాటుదారులను వెంటనే భవనం నుంచి ఖాళీ చేయించామన్నారు.

అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు అమెరికా చట్టసభ సభ్యులు కొలువుదీరే కాంగ్రెస్‌ భవనంపై అసాధారణ స్థాయిలో దాడులకు దిగిన విషయం తెలిసిందే. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఒక మహిళ సహా నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.