శ్రీలీల పై మోక్షజ్ఞ ప్రత్యేక ఇంట్రెస్ట్

26
- Advertisement -

అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న చిత్రం ‘భగవంత్ కేసరి’. నిన్న హన్మకొండలోని యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్‌ అండ్ సైన్స్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌‌లో ఈ సినిమా ట్రైలర్‌‌ను లాంఛ్‌ చేశారు. నువ్వేడున్నా గిట్ల దమ్ముతో నిలబడాలే.. అప్పుడే ధునియా నీ బాంచెన్ అంటది అంటూ తెలంగాణ యాసలో సాగే డైలాగ్స్‌తో షురూ అయింది ట్రైలర్‌. ఐతే, ఈ ఈవెంట్ లో బాలయ్య తన కొడుకు మోక్షజ్ఞ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ బాలయ్య ఏం మాట్లాడాడు అంటే..

‘ఈ మూవీలో శ్రీలీల నా కుమార్తెగా నటించింది. తర్వాతి సినిమాలో హీరోహీరోయిన్లుగా యాక్ట్ చేద్దామని ఆమెతో చెప్పా. ఈ విషయం నా ఇంట్లో చెప్పాను. వెంటనే నా కొడుకు సీరియస్ అయ్యాడు. ఓ వైపు నేను హీరోగా రాబోతుంటే.. నువ్వు ఆమెకు ఆఫర్ ఇస్తావా ?, గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా? అంటూ మోక్షజ్ఞ బాలయ్యని తిట్టాడట. మరి బాలయ్య, శ్రీలీలకు ఆఫర్ ఇస్తే.. మోక్షజ్ఞ కు ఏమైంది ?, బహుశా శ్రీలీలతో కలిసి నటించాలని మోక్షజ్ఞ ఆశ పడుతున్నాడేమో. అందుకే, నా హీరోయిన్ తో నీ లొల్లి ఏంటి ? అన్న రీతిలో గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా? అని మోక్షజ్ఞ తిట్టి ఉంటాడని నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు.

ఒక్కటి మాత్రం నిజం.. బాలకృష్ణ, మోక్షజ్ఞ ను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. ప్రేక్షకులకు ఎప్పుడూ తమ అభిమాన హీరోల వారసులను, వారి సినిమాలు ఆదరించడానికి ఎప్పుడు ముందు ఉంటారు. ఈ క్రమంలో తన తాపత్రయమని బాలకృష్ణ పై రకంగా చెప్పి ఉంటాడు. మోక్షజ్ఞ వస్తున్నాడు అని చెప్పడమే ఇక్కడ బాలయ్య ఉద్దేశ్యం కావొచ్చు. అందుకు, హన్మకొండలో జరిగిన ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ ను ఆయన వాడుకుని ఉండొచ్చు. ఏది ఏమైనా బాలయ్య మోక్షజ్ఞ పై చాలా ఆసలు పెట్టుకున్నాడు.

Also Read:Chiranjeevi:మెగాస్టార్ రూట్ మార్చారా?

- Advertisement -