- Advertisement -
బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ స్థాపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రపంచవ్యాప్తంగా జోరుగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా న్యూ ఢిల్లీ హై కమిషన్ ఆఫ్ ద కింగ్డమ్ లెసోతో మిస్టర్ తబాంగ్ లినస్ ఖోలుమో హైదరాబాద్‌లోని శిల్పారామంలో మొక్కలు నాటారు
ఈ సందర్బంగా మాట్లాడుతూ…పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం అభినందనీయమని అన్నారు. ఈ భూమిని మనం విడిచి పెట్టినా మనం నాటిన చెట్లు మిగులుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో చెట్లను నరికివేస్తున్న మళ్లీ మనం చెట్లను పెంచి పర్యావరణంను కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూరత్‌సింగ్ మల్హోత్రా, టూరిజం కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్, రాఘవ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
కర్ణాటక పోల్‌వార్..బోనీకపూర్ కారులో వెండి సీజ్..!
సుఖోయ్‌లో ప్రయాణించిన రాష్ట్రపతి..
TELANGANA:హరీశ్..అబద్ధాల కోసమే తెలంగాణకు మోదీ..!
- Advertisement -