వర్మతో రెడీ అంటున్న సూపర్‌స్టార్‌..

196
- Advertisement -

రామ్‌ గోపాల్ వర్మ చేసే ట్విట్స్‌ కాని వర్మ తీసే సినిమాలు కాని హాట్‌ టాపిక్‌గా మారుతుంటాయి.అయితే వర్మ సినిమా అంటే తెలుగు,హిందీ,తమిళ్‌ ఏ ఇండస్ట్రీలో ఐనా స్టార్‌ హీరోలు సైతం సై అనే వారు. కాని గత కొన్నేళ్లలో రామ్ గోపాల్ వర్మను నమ్మి చాలామంది హీరోలు దెబ్బ తిన్నారు. ఆయన సినిమాల్లో క్వాలిటీ దారుణంగా పడిపోయి చాలా కాలమైపోయింది. గత దశాబ్ద కాలంలో ఆయన ఎలాంటి సినిమాలు తీశారో అందరికీ తెలుసు. ఈ సమయంలో ఒక్క అమితాబ్ బచ్చన్ మినహాయిస్తే ఏ స్ఠార్ హీరో వర్మతో సినిమా చేయడానికి ముందుకు రాలేదు.

టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌ వరకు ఇప్పుడు వర్మతో పని చేయడానికి ఇంకే పెద్ద హీరో కూడా ఆసక్తి చూపడనే అనుకుంటున్నారంతా. ఐతే ఇలాంటి టైంలో మలయాళ సూపర్ స్టార్ మోహనలాల్.. వర్మతో పని చేయడానికి రెడీ అని ప్రకటించడం విశేషం.

Mohanlal wants to do a movie with Ram Gopal Varma

ఈ మలయాళ సుపర్‌స్టార్‌ అద్బుతమైన నటనా ప్రతిభతో ‘కంప్లీట్ యాక్టర్’ అని గుర్తింపు తెచ్చుకున్నారు.. దక్షిణాదిన దాదాపుగా అన్ని భాషల్లోనూ నటించాడు. హిందీలోనూ ఆయన చాలా కాలం కిందట ‘కంపెనీ’ సినిమా చేశాడు. దానికి దర్శకుడు వర్మనే. ఆ సినిమా సూపర్ హిట్టయింది. లాల్‌కు కూడా మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ఇప్పటిదాకా మళ్లీ హిందీ సినిమాలో నటించలేదు లాల్. ఐతే ఇప్పుడు ఆయనకు మళ్లీ బాలీవుడ్ మీద మనసు మళ్లింది. తనకు ఇప్పుడు మళ్లీ బాలీవుడ్లో నటించాలని ఉందని.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నటించడానికి రెడీ అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో లాల్ వ్యాఖ్యానించాడు.

అయితే మోహన్‌లాల్ ఇంతకుముందు పని చేసినప్పటికి.. ఇప్పటికి వర్మ ట్రాక్ రికార్డు ఎంత దారుణంగా తయారైందో అందరికీ తెలిసిందే. తన సినిమాల హడావుడిలో పడి మోహన్‌లాల్ ఆ విషయం గుర్తించలేదేమో. మరి మోహన్‌లాల్ తనతో పని చేయడానికి ఆసక్తి చూపించిన నేపథ్యంలో వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఆయన ఈపాటికే తన శిష్య బృందానికి స్టోరీ ఐడియా చెప్పేసి స్క్రిప్టు రెడీ చేయించేస్తూ ఉన్నా ఆశ్చర్యమేమీ లేదు.

- Advertisement -