‘కిర్రిక్ పార్టీ’ రీమేక్‌లో యంగ్‌ హీరో..

191
- Advertisement -

హిట్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాడు యంగ్‌ హీరో నిఖిల్‌. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘సూర్య వర్సెస్‌ సూర్య’, ‘కార్తికేయ మూడేళ్లుగా నిఖిల్‌ నటించిన సినిమాలన్నీ హిట్టే. ఈ జైత్రయాత్ర ‘స్వామి రారా’ నుంచి మొదలైంది. నిఖిల్‌ సూపర్‌హిట్‌ ఇన్నింగ్స్‌కి స్ట్రాంగ్‌ పునాది వేసిన దర్శకుడు సుధీర్‌వర్మ. ‘స్వామి రారా’ తర్వాత నిఖిల్, సుధీర్‌వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘కేశవ’. తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు డిస్ట్రిబ్యూషన్‌ చేసిన శ్రీ అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది.

Nikhil to act in remake of Kirik Party

అయితే ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నిఖిల్, త్వరలో ‘కేశవ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వైవిధ్యభరితమైన కంటెంట్ తో రానున్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరి ఈ సినిమా తరువాత కొరియో గ్రాఫర్ రాజు సుందరం దర్శకుడిగా పరిచయం కానున్న ప్రాజక్టుతో నిఖిల్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు.

మరి ఈ సినిమాను జూన్ లో లాంచ్ చేయనున్నారు. ఏడాది క్రితం కన్నడలో భారీ విజయాన్ని అందుకున్న ‘కిర్రిక్ పార్టీ’కి ఇది రీమేక్. ఇంజనీరింగ్ చేసే కుర్రాళ్ల జీవితాలను రాజకీయాలు ఎలా ప్రభావితం చేశాయి? వాళ్ల జీవితాలలో చోటుచేసుకున్న మలుపులు ఎలాంటివి? అనే కథాంశంతో ఈ సినిమా కొనసాగనుంది. దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాకి కథ – స్క్రీన్ ప్లే ను సమకూర్చడం విశేషం.

- Advertisement -