శ్రీమిత్ర చౌదరి సమర్పణలో ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ హీరో గా,నాజియా నాయికగా నటిస్తున్న చిత్రం ‘రా.రా…’ . విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. జూన్ నెల ప్రథమార్ధం లో విడుదల కాబోతోంది.
ఈ చిత్రం టీజర్ ను ఇటీవల సుప్రసిద్ధ నటుడు మోహన్ లాల్ విడుదల చేసారు. (మోహన్ లాల్ ,శ్రీకాంత్ కలసి నటిస్తున్న ‘విలన్’ షూటింగ్ లో ఈ టీజర్ విడుదల) మోహన్ లాల్ మాట్లాడుతూ ‘ రా రా’ చిత్రం టీజర్ ను చూసిన తరువాత చిత్రాన్న్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న ఉత్సుకత మరింత పెరిగింది. చిత్రం మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని అయన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ . మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గారి చేతుల మీదుగా ఈ చిత్రం టీజర్ విడుదల కావటం ఎంతో ఆనందంగా ఉంది. ‘ ఇది హాస్యం తో కూడిన హర్రర్ ధ్రిల్లర్ చిత్రం. మనుషులకు, దెయ్యాలకు మధ్య సాగే సరదా ఆటలు సగటు సినిమా ప్రేక్షకుడిని వినోదాల తీరంలో విహరింప చేస్తాయి. హర్రర్ కామెడీ ధ్రిల్లర్ చిత్రం నేను తొలిసారి చేస్తున్నాను. ‘రా..రా ‘చిత్రం ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటుదని ఆశిస్తున్నాను అన్నారు.
మా హీరో, మిత్రుడు శ్రీకాంత్ తో రూపొందిస్తున్న ‘రా..రా’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. చిత్రం ఆడియో వేడుకను విభిన్న రీతిలో జరుపనున్నాము. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని, వచ్చే నెలలో చిత్రంను విడుదల చేస్తున్నట్లు నిర్మాత విజయ్ తెలిపారు.
శ్రీకాంత్ హీరోగా, నాజియా కథానాయికగా ‘విజి చరిష్ విజన్స్’ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో గిరిబాబు,సీత,నారాయణ,ఆలీ,రఘుబాబు,పోసానికృష్ణ మురళి, పృథ్వి,జీవ,చంద్రకాంత్, అదుర్స్ రఘు,హేమ, షకలక శంకర్, నల్లవేణు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాప్ రాక్ షకీల్, ఫోటోగ్రఫి: పూర్ణ, పోరాటాలు: గిల్లె శేఖర్, ఎడిటర్: శంకర్, సమర్పణ: శ్రీమిత్ర చౌదరి ,నిర్మాత: విజయ్ ,దర్శకత్వం: విజి చరిష్ యూనిట్.