సినీ సెలబ్రిటీలు, క్రీడాకారులు, సామాన్యులు ఇలా ప్రతి ఒక్కరూ ఈ మధ్య ఫిట్‌నెస్ ఛాలెంజ్‌కు ఓ రేంజ్‌లో స్పందిస్తున్నారు. కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్. ‘హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్’ పేరుతో మొదలైన ఈ ఛాలెంజ్‌కు ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. మొదటగా రాజ్యవర్ధన్ తాను పుషప్స్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, క్రికెట్ విరాట్ కోహ్లీ, బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌కి సవాల్ విసిరారు.
ఇక్కడితో మొదలైన ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్ నాగ చైతన్య, సమంతా, అఖిల్, లావణ్య త్రిపాఠి విరాట్ కోహ్లీ వరకు చేరుకోవడంతో ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. తాజాగా ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో చేరాడు మళయాళ నటుడు మోహన్ లాల్. ఆయన డంబెల్స్ ఎత్తుతున్న ఓ ఫోటోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ సూర్య, ఎన్టీఆర్, పృథ్వీరాజ్‌లను ఆహ్వానిస్తున్నాని పేర్కొన్నాడు.
ఎన్టీఆర్, మోహన్ లాల్ కలిసి ‘జనతా గ్యారేజ్’ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇక మోహన్ లాల్ విసిరిన ఈ ఛాలెంజ్‌కు ముందుగా ఎవరూ స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇలా అన్ని రంగాల వారు ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌కు స్పందిస్తున్నారు.