సుధీర్ బాబు హీరోగా నటించిన సమ్మోహనం సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈసినిమాకు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. ఈమూవీ హీరో సుధీర్ బాబు కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా చెప్పుకోవచ్చు. సుధీర్ బాబుకు జంటగా అదితి రావ్ హైదరి నటించింది. ప్రస్తుతం ఈచిత్రం బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి సినిమాల్లో సమ్మోహనం సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఇక సమ్మోహనం కథను డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి చాలా మందికి వినిపించాడని సమచారం. అందులో ముఖ్యంగా అక్కినేని యువ హీరో నాగ చైతన్యకు మొదట ఈకథను వినిపించాడట డైరెక్టర్. స్లోరీ లైన్ విన్న నాగచైతన్య డైరెక్టర్ కు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో ఆ సినిమా సుధీర్ బాబు చేయాల్సివచ్చిందని ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నాగ చైతన్య ఈస్టోరీ అనవసరంగా వదులుకున్నాడని టాక్ వినిపిస్తోంది.
అయితే మోహనకృష్ణ ఇంద్రగంటి చైతుకి ఒకే సారి మూడు కథలు వినిపించాడు. అందులో సమ్మోహనం కూడా ఒకటి. ఒకే సారి మూడు కథలు వినిపించడంతో అతనికి ఏ కథ చేయాలో అర్ధం కాక డైరెక్టర్ కు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. చైతు ఈసినిమాను ఒప్పుకోకపోవడానికి మరో బలమైన కారణం ఉంది. చైతన్య ఇప్పటికే రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. సవ్వసాచి, శైలజారెడ్డి అల్లుడు రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుగుతుండంతో ఈప్రాజెక్ట్ కు ఒకే చేయలేదని చెబుతున్నారు. ఏది ఏమైనా చైతూ మాత్రం మంచి హిట్ మూవీని చేతులారా చేజార్చుకున్నాడని సినీ విశ్లేషకులు అనుకుంటున్నారు.