మ‌హేశ్ రీల్ హీరో మాత్ర‌మే..మాధ‌విల‌త హాట్ కామెంట్స్

260
madhavilatha, mahesh babu

టాలీవుడ్ లో మొన్న‌టివ‌ర‌కు జ‌రిగిన క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో తాను కూడా బాధితురాలినే అని త‌న గ‌ళం విప్పింది హీరోయిన్ మాధ‌విల‌త‌. మాధ‌విల‌త ఈమ‌ధ్యే కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రి ఆధ్వ‌ర్యంలో బీజేపీలో చేరిన విష‌యం తెలిసిందే. అయితే టాలీవుడ్ టాప్ హీరో మ‌హేశ్ బాబు పై మండిప‌డ్డారు హీరోయిన్, న‌టి మాధ‌విల‌త‌. ఈసంద‌ర్భంగా ఓ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్యూలో ఆమె మ‌హేష్ బాబు, డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

madhavi latha, surendar reddy

షూటింగ్ టైం లో తెలుగు న‌టిన‌టుల‌ను ఏవ‌రూ ఎమ‌న్నా హీరోలు ప‌ట్టించుకోర‌న్నారు. తెలుగు హీరోయిన్ ల‌ను డైరెక్ట‌ర్లు బండ‌బూతులు తిట్టినా హీరోలు మాత్రం ప‌ట్టించుకోర‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఈసంద‌ర్భంగా త‌న‌కు జ‌రిగిన ఓ ఇన్సిడెంట్ ను గుర్తు చేసింది. మ‌హేవ్ బాబు అతిధి సినిమా షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి త‌న‌ను ఓ బూతు ప‌దంతో తిట్టాడ‌ని చెప్పింది. నా ప‌క్క‌నే ఉన్న మ‌హేశ్ బాబు మాత్రం అలా ఎందుకు తిడుతున్నావ్ అని డైరెక్ట‌ర్ ను అడ‌గ‌లేద‌ని వాపోయారు.

Madhavi-Latha

మ‌హేశ్ చెప్తే ఏ స్టార్ డైరెక్ట‌ర్ అయినా వినే స్ధాయి ఆయ‌న‌ది అయినా ఆయ‌న మాత్రం ప‌ట్టించుకోకుండా ఆయ‌న ప‌ని ఆయ‌న చేసుకుంటూ వెళ్లి పోయార‌ని చెప్పింది. తెలుగు హీరోలు స్క్రీన్ మీద మాత్ర‌మే రియ‌ల్ హీరోలు…రీయ‌ల్ లైఫ్ లో మాత్రం జిరోలు అని చెప్పింది. త‌న ముందే డైరెక్ట‌ర్ ఆ బూతు ప‌దం వాడినా మ‌హేశ్ మాత్రం చూసి చూడ‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించాడ‌న్నారు. మ‌హేశ్ కు నాకు వ్య‌క్తిగ‌తంగా ఎలాంటి మ‌న‌స్ప‌ర్ధాలు లేవ‌ని…అమ్మాయిల‌కు అన్యాయం జ‌ర‌గుతున్న‌పుడు ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని తాను అడుగుతున్నాన‌ని చెప్పింది.