అల్లు అరవింద్‌తో మహేష్‌ మూవీ..?

251
Mahesh Babu
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. వీరిద్దరి కలయికలో సినిమా. ఆ ఊహే ఎంతో భారీగా ఉంది. ఇప్పుడు ఈ ఊహే నిజమయ్యే సూచనలున్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నిర్మాతగా అల్లు అరవింద్ రేంజ్.. గీతా ఆర్ట్స్ బ్యానర్ కు ఉన్న వాల్యూ హై లెవెల్ లోనే ఉంటాయి. అయితే.. భారీ సినిమాల విషయంలో మెగా హీరోలతోనే తీసేందుకు మొగ్గు చూపే ఆయన.. అప్పుడప్పుడు లో- మీడియం బడ్జెట్ చిత్రాలు కూడా తెరకెక్కిస్తూ ఉంటారు. కానీ ఇతర స్టార్ హీరోలతో అల్లు అరవింద్ సినిమా తీయడం అంటే కాసింత ఆశ్చర్యకరమైన విషయమే. ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

Mahesh Babu

ఇక మహేశ్ బాబు తన 25వ సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘డెహ్రా డూన్’లో ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమా తరువాత మహేశ్ బాబు సినిమా ఏ బ్యానర్లో వుండనుందనే విషయమే అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అన్నీ కుదిరితే గీతా ఆర్ట్స్ లో మహేశ్ బాబు చేయవచ్చనేది సమాచారం. ఇటీవలే మహేశ్ బాబు .. అల్లు అరవింద్ కలిసి ఒక ప్రాజెక్టు గురించిన చర్చలు జరిపినట్టుగా చెప్పుకుంటున్నారు.

మంచి కథ .. దర్శకుడు కుదిరితే చేయడానికి తాను సిద్ధంగా వున్నట్టుగా మహేశ్ బాబు చెప్పడం జరిగిందని అంటున్నారు. ఎక్కువగా మెగా హీరోలతోనే సినిమాలు ప్లాన్ చేసే అల్లు అరవింద్, మహేశ్ బాబుతో సినిమా ప్లాన్ చేయడమే ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య ఇతర హీరోలతోను అల్లు అరవింద్ సినిమాలు చేస్తున్నారు కాబట్టి .. ఆయన మహేష్‌తో ట్రై చేయడం నిజమై ఉండొచ్చని మరికొంతమంది అంటున్నారు. మరి వీరిద్దిరి కాంబోలో ఎలాంటి సినిమా రాబోతుందో చూడాలి.

- Advertisement -