- Advertisement -
ప్రముఖ నటుడు డా. మోహన్ బాబు బావ అయిన మేడసాని వేంకటాద్రి నాయుడు సోమవారం మృతి చెందారు. తనకు బావగానే కాకుండా మంచి మితృడుగా మోహన్ బాబు పదే పదే చెప్పుకునే ఆయన చెల్లెలు విజయలక్ష్మి భర్త మేడసాని వెంకటాద్రినాయుడు గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. నిన్న రాత్రి 8.30 గంటలకు ఆయన మృతి చెందారు. ఈ సాయంత్రం 4 గంటలకు నారావారిపల్లెలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
మోహన్ బాబు నటించిన పలు సినిమాలకు వెంకటాద్రినాయుడు నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాదు, తిరుపతిలో మోహన్ బాబు స్థాపించిన శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల కోశాధికారిగా కూడా ఆయన వ్యవహరించారు. వెంకటాద్రినాయుడి మృతిపట్ల సినీ పరిశ్రమకు చెందిన పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
- Advertisement -