‘డార్లింగ్‌’ కోసం అనుష్క ఏం చేసింది..?

264
This is what Anushka Shetty gifted Prabhas on his birthday
- Advertisement -

‘అనుష్క, ప్రభాస్‌ ఇద్దరూ లవ్‌ బర్డ్స్‌..వీరిద్ద‌రూ చాలా కాలం నుంచి ప్రేమ‌లో ఉన్నారు. `బాహుబ‌లి` సినిమా త‌ర్వాత పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.’ అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు హల్చల్‌ చేసిన విషయం తెలిసిందే.

 This is what Anushka Shetty gifted Prabhas on his birthday

ఇక ఆ నోటా,ఈ నోటా విషయం వీరిద్దరి దగ్గరకూ వెళ్ళేసరికి..అబ్బే అలాంటిదేం లేదు… అని వీరిద్దరూ స్టేట్‌మెంట్స్‌ ఇచ్చేశారు. దాంతో సోషల్ మీడియాలో హీట్‌ పుట్టించిన వీరి వార్తలకు ఒక్కసారిగా చెక్‌ పడింది. ఇంత జరిగినా…మళ్ళీ వీరిద్దరి వ్యవహారం పై రూమర్స్‌ వస్తూనే ఉన్నాయనుకోండి అది వేరే విషయం.

 This is what Anushka Shetty gifted Prabhas on his birthday

ఇదిలా ఉంటే..యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తాజాగా 38వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్టాడు. సోమ‌వారం ప్ర‌భాస్ పుట్టిన రోజు జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా చాలా మంది సినీ ప్ర‌ముఖుల నుంచి ప్ర‌భాస్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అందాయి.

ఇక ప్ర‌భాస్‌తో నాలుగు సినిమాల్లో న‌టించిన అనుష్క కూడా ప్ర‌భాస్‌కు బ‌ర్త్‌డే విషెస్ చెప్పింది. అంత‌టితో ఊరుకోకుండా ప్ర‌భాస్‌కు ఓ మంచి కానుక కూడా అందించింద‌ట దేవ‌సేన‌. ప్ర‌భాస్‌కు డిజైన‌ర్ వాచీలంటే చాలా ఇష్ట‌మట‌. అందుకే ప్ర‌భాస్ కోసం ప్ర‌త్యేకంగా ఓ వాచీని డిజైన్ చేయించి అంద‌జేసింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మొత్తానికి సెలబ్రిటీలు తుమ్మినా, దగ్గినా సంచలనమే అంటే బహుషా ఇదేనేమో..!

- Advertisement -