‘నేను ఎవడితో తిరిగితే..మీకేంటి’..?

191
- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ మహిరా ఖాన్…. హీరో రణబీర్ కపూర్ తో చాలా క్లోజ్ గా ఉంటూ, అతడితో కలిసి సిగరెట్ తాగుతూ కెమెరాకు దొరికిపోయింది. అప్పట్నుంచి మీడియాకు ముందు కనిపించలేదు ఈ బ్యూటీ. కానీ..ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత మీడియా ముందుకనిపించింది.

ఇక రణబీర్‌ సిగరెట్ తాగుతూ కనిపించిన మహిరా ఆ మేటర్ పై స్పందించక తప్పలేదు.

 maheera khan fire on media..

తన సినిమా ట్రయిలర్ లాంచ్ సందర్భంగా మీడియా ముందుకొచ్చింది మహిరా. ఇక తనకు.. రణబీర్ తో సాన్నిహిత్యంపై చాలా ఓపెన్ గా మాట్లాడింది. తారల వ్యక్తిగత విషయాలకు మీడియా దూరంగా ఉంటే మంచిదని సూచించించింది. అంతేకాకుండా తాను ఎవరితో కలిసి తిరిగితే మీకేంటని ఎదురు ప్రశ్నించింది.

ఆ ఫొటోలో సిగరెట్ తాగడం, బ్యాక్ కనిపించేలా డ్రెస్ వేసుకున్న విధానంపై మహిరాపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పుమన్నాయి. దానిపై స్పందించిన ఈ బ్యూటీ.. సిగరెట్ తాగడం తప్పనే విషయం తెలుసని… కానీ డ్రెస్సింగ్ విషయంలో మాత్రం ఎలా ఉండాలో తనకు సలహాలు ఇవ్వొద్దని కాస్త గట్టిగానే బదులిచ్చింది.

 maheera khan fire on media..

మొత్తమ్మీద రణబీర్ కపూర్ తో ఇకపై కూడా క్లోజ్ గానే ఉంటానని పరోక్షంగా చెప్పుకొచ్చింది ఈ చిన్నది. మరోవైపు రణబీర్ మాత్రం తనకు మహిరాకు మధ్య ఎఫైర్ ఉందంటూ వార్తలు రాయొద్దని మీడియాను రిక్వెస్ట్ చేయడం విశేషం.

- Advertisement -