- Advertisement -
సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు…టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు వీరి సమావేశం జరుగగా ఇప్పుడు ఈ అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తన విద్యాసంస్థ శ్రీ విద్యానికేతన్ సమీపంలో నిర్మించిన సాయిబాబా గుడి విగ్రహ ప్రతిష్ఠాపన ఆగస్టులో చేయనున్నారు మోహన్ బాబు. ఇందుకోసం ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా చంద్రబాబును మోహన్ బాబు ఆహ్వానించారట. అయితే గంటపాటు వీరిద్దరి భేటీ జరుగడంతో రాజకీయ అంశాలు కూడా తెరమీదకు వచ్చాయని భావిస్తున్నారు. మొత్తానికి చాలాకాలం తర్వాత వీరిద్దరి భేటీ జరుగడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
- Advertisement -