ప్ర‌భాస్‌తో చాలా కంఫ‌ర్ట్…దిశా!

64
- Advertisement -

నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం ప్రాజెక్ట్ K .ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న దిశా ప‌టానీ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా శ‌ర‌వేగంగా సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. ఇక ప్ర‌స్తుతం దిశ ప‌టాని న‌టించిన ఏక్ విల‌న్ రిట‌ర్న్స్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో ఆస‌క్తిక‌ర విష‌యాలను వెల్ల‌డించింది.

ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ గురించి మాట్లాడుతూ ఆయ‌న‌తో న‌టించ‌డం చాలా ఈజీ అని ..సెట్ లో ప్రభాస్‌ స్టార్‌ అనే విషయాన్ని పక్కన పెట్టి చాలా సింపుల్‌గా ఉంటాడని తెలిపింది. ప్రభాస్ తనతో కలిసి పని చేసే వాళ్ళకి తన ఇంటి నుంచి భోజనం తెప్పించి పెడతారని చెప్పుకొచ్చింది.

తాను ఇప్పటివరకు పనిచేసిన మంచి నటుల్లో ప్రభాస్ ఒకరు. ప్రభాస్ అందరితో ప్రేమగా ఉంటారు. ఆయన చూపించే ప్రేమను అంత ఈజీగా మరచిపోలేము. నేనైతే అలాంటి హీరోను ఇప్పటివరకు చూడలేదు అని తెలిపింది.

- Advertisement -