క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మహ్మదుల్లా

187
Mahmudullah
- Advertisement -

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ మహ్మదుల్లా. టెస్టు క్రికెట్‌కు గుడ్‌ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. శుక్రవారం నుంచి బంగ్లాదేశ్-పాకిస్థాన్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారు మహ్మదుల్లా.

టెస్టు కెరీర్‌ను ముగించేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్లు మహ్మదుల్లా ప్రకటించాడు. తన కెరీర్‌లో తనకు అండగా నిలిచిన, మద్దతు తెలిపిన బంగ్లా క్రికెట్ బోర్డుకు అతడు కృతజ్ఞతలు తెలియజేశాడు. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినా టీ20లు ఆడతానని మహ్మదుల్లా తెలిపాడు.

టెస్టు క్రికెట్‌లో 50 టెస్టులు ఆడిన మహ్మదుల్లా 33.11 సగటుతో 2,914 పరుగులు చేశాడు. అతడి పరుగుల్లో ఐదు సెంచరీలు, 16 అర్థసెంచరీలు ఉన్నాయి. కెరీర్ అత్యధిక స్కోరు (150)ను జింబాబ్వేపై నమోదు చేశాడు.

- Advertisement -