నెట్‌ ఫ్లిక్స్‌లో పెద్దన్న..

25
peddanna

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పెద్దన్న. దీపావళి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకురాగా ఏసియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్ధాయిలో విడుదల చేశారు.

శివ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా కీర్తి సురేశ్ రజనీకాంత్ చెల్లిగా నటించారు. సీనియర్ హీరోయిన్స్ కుష్బూ, మీనా కీలక పాత్రల్లో కనిపించారు.

కాగా అణ్ణాత్త ( పెద్దన్న ) డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. గురువారం రాత్రి నుంచే ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ భాషలతో పాటు ఇతర భాషల్లోనూ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్‌లో మిస్సయిన ప్రేక్షకులు ఇప్పుడు చూసేయొచ్చు.