రివ్యూ: దృశ్యం2

19
drushyam 2

మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం దృశ్యం 2. వెంకీ సరసన మీనా హీరోయిన్‌గా నటించగా అమెజాన్‌ ప్రైమ్‌లో ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. దృశ్యం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోగా దీనికి సీక్వెల్‌గా వచ్చిన దృశ్యం 2తో వెంకీ అలరించాడా లేదా చూద్దాం…

కథ:

ఆరేళ్ళ క్రితం కథ ఎక్కడ ఆగిందో, ఈ సీక్వెల్ ను దర్శకుడు జీతూ జోసఫ్ అక్కడే మొదలు పెట్టారు. వరుణ్‌ శవం దొరక్కపోవడం, అతను హత్యకు గురైన రోజున రాంబాబు తన కుటుంబం ఊర్లోనే లేదని ఆధారాలు సృష్టించడంతో పోలీసులు కేసును క్లోజ్ చేస్తారు. అయితే ఉద్యోగ విరమణ అనంతరం అమెరికాకు వెళ్ళిన వరుణ్ తల్లి గీత (నదియా) ఎలాగైనా రాంబాబు మీద పగ తీర్చుకోవాలనే పంతంతో ఉంటుంది. ఇందుకు ప్రస్తుతం ఐజీపీగా ఉన్న గౌతమ్ సాహు (సంపత్ రాజ్) సాయంతో రాంబాబుపై నిఘా పెడుతుంది. తర్వాత ఏం జరుగుగుంది…పోలీసుల కుట్ర నుండి రాంబాబు ఎలా తప్పించుకున్నాడు అన్నదే ‘దృశ్యం -2’ కథ.

ప్లస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ నటీనటులు, ఆకట్టుకునే కథ, కథనాలు,ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌. రాంబాబు పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు వెంకీ. పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో వినయ్‌ వర్మ, రాంబాబు లాయర్‌ గా పూర్ణ, అతని పక్కింటి వ్యక్తులుగా సత్యం రాజేశ్‌, సుజీ బాగా చేశారు. ‘దృశ్యం’లోనూ చక్కని నటన కనబరిచిన నదియా, నరేశ్ ఇందులోనూ అదే సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమాను ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతితో కలిసి సురేశ్‌ బాబు లిమిటెడ్ బడ్జెట్ లోనే నిర్మించారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ అలరించని నేపథ్య సంగీతం. బోర్ కొట్టే ఫస్ట్ ఆఫ్.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్.

సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ పకడ్బందీగా సీన్స్ రాసుకుని, ఆసక్తికరంగా దానిని తెరకెక్కించడంలో జీతూ జోసఫ్‌ సక్సెస్ అయ్యాడు. సతీశ్‌ కురుప్ అందించిన సినిమాటోగ్రఫీ సూపర్బ్. అనూప్ రూబెన్స్ చక్కని నేపథ్య సంగీతం బాగుంది. మార్తాండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ బాగుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని సన్నివేశాలను మార్చడం, కథను మరింత ఆసక్తికరంగా చెప్పడంతో మలయాళ మాతృక కంటే ఇది బెటర్ గా ఉంది.

తీర్పు:

కన్నకొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు, ఆ కొడుకు శవాన్ని కూడా చూడలేకపోవడంతో కలిగే బాధ. సేమ్ టైమ్ ఓ హత్యను దాచిపెట్టాలని చూసే వ్యక్తి మానసికంగా ఎంత కృంగిపోతాడో ఈ సినిమాలో చక్కగా చూపించారు దర్శకుడు. ఓవరాల్‌గా అందరికి నచ్చే మూవీ దృశ్యం 2.

విడుదల తేదీ:25/11/2021
రేటింగ్: 3/5
నటీనటులు: వెంకటేష్, మీనా
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాత:సురేష్ బాబు
దర్శకుడు:జీతూ జోసఫ్