అమరుల స్వప్నం సాకారం కావాలి..

213
modi pawan

తెలంగాణ వ్యాప్తంగా 4వ అవ‌త‌ర‌ణోత్స‌వ వేడుక‌లు అంబరాన్నంటాయి. ప్రతి జిల్లా కేంద్రంలో ప్రజాప్రతినిధులు జాతీయ జెండా ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్విట్టర్ ద్వారా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కలలు సాకారం కావాలని ఆకాంక్షించారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం పాడిపంటల్లో, పరిశ్రమల్లో, ఉపాధి ఉద్యోగ కల్పనలో అభివృద్ధి చెందుతూ ముందుకు సాగాలని పవన్ కోరారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అందరూ కలిసి తెలంగాణను సుసంపన్నం చేసుకోవాలని జనసేనాని పిలుపునిచ్చారు.

ఆరున్నర దశాబ్దాల పోరాటంలో.. వందలమంది పోరాటయోధులు తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారు. అమర వీరుల త్యాగాలను మరవకుండా.. వారి కలలను సాకారం చేయాల్సిన బాధ్యత పాలకులదే అని అన్నారు.