తెలంగాణ ఆవిర్భావం.. 2,786 ఉద్యోగాల భర్తీ..!

207
kcr

రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా నిరుద్యోగులకు శుభ‌వార్త తెలిపింది తెలంగాణ‌ ప్ర‌భుత్వం. రెండు రోజుల క్రితమే పోలీస్ శాఖ‌లో 18,428 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం తాజాగా మరిన్ని పోస్టుల విడుదలకు పచ్చజెండా ఉపింది. రాష్ట్రావతరణ కానుకగా 2,786 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం.

ఉద్యోగాల భర్తీపై తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రకటన చేయనున్నారు. ఆ వెంటనే టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు వెలువరించనుంది. పాత జోన్లు, పాత జిల్లాలే ప్రామాణికంగా తీసుకొని నియామక ప్రక్రియ చేపట్టనున్నారు.

విభాగాల వారీగా చూస్తే రెవెన్యూశాఖలో ఎల్‌డీ, జూనియర్ స్టేనో 15, టైపిస్ట్ 292, జూనియర్ అసిస్టెంట్స్ 217, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్స్ 231, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్స్ 32,పంచాయతీరాజ్‌శాఖలో జూనియర్ అసిస్టెంట్స్ 53, టైపిస్ట్ 64, హోమ్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్స్ 22, సీనియర్ స్టెనో 6, జూనియర్ స్టెనో 335, టైపిస్ట్ 79 పోస్టులు తో పాటు పలు విభాగాల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరగనుంది.