ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

780
mp kavitha
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ సంబరాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ గన్‌పార్క్ వద్ద అమరులకు నివాళులు అర్పించి ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో ప్రజాప్రతినిధులు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ భవన్‌లో హోంమంత్రి నాయిని,డిప్యూటీ సీఎం మహమూద్ అలీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

తెలంగాణ రాష్ర్టావతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఎంపీ కవిత హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల సహకారం వల్లే స్వరాష్ట్రం కల సాకారమైందని కవిత ట్వీట్ చేశారు. ఇదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాధన కోసం కనబరచాలని ఆమె పిలుపునిచ్చారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తోందన్నారు.నాలుగేళ్లలో రాష్ట్రం అనేక పథకాలతో ముందుకెళ్తుందన్నారు. రైతుల కోసం రైతుబంధు, రుణమాఫీ చేసిన ప్రభుత్వం..ఈ ఆగస్టు నుంచి రైతు భీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు.భూ రికార్డుల ప్రక్షాళనలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముందుండటం గర్వకారణం అన్నారు. జూన్ 20లోగా వందశాతం పట్టాపాస్ పుస్తకాలు, రైతుబంధు మిషన్ భగీరథ 95 శాతం పనులు పూర్తయ్యాయని త్వరలోనే వేములవాడ, సిరిసిల్లలో ఇంటింటికి మంచి నీరు వస్తుందన్నారు.

వికారాబాద్ పోలీసు గ్రౌండ్ లో రాష్ట్ర అవతరణ వేడుకల్లో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్ళు పూర్తి చేసుకుని ఐదో వసంతంలోకి అడుగు వేస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో సమకూరే సంపద రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు తోడ్పడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. పేదరికాన్ని తరిమేస్తామన్నారు.

mahender reddy

- Advertisement -