Modi:మోడీ ‘టార్గెట్ 400’.. ఎందుకంటే?

27
- Advertisement -

ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. 2014, 2019 ఎన్నికలల్లో వరుసగా అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఈసారి గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని చూస్తోంది. అయితే ఈసారి గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు కమలనాథులు. 545 లోక్ సభ స్థానాలకు గాను 400 పైగా సీటు సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు. అందులో కేవలం బీజేపీనే 370 సీట్లు సాధించాలని ఇక కూటమిలోని పార్టీలు మరో 30 సీట్ల మేర సాధించి ఓవరాల్ గా 400 ప్లేస్ సాధించాలని బీజేపీ అగ్రనేతలు పదే పదే చెబుతున్నారు. .

అయితే ఎన్డీయే కూటమికి ఆ స్థాయిలో సీట్లు లభించే అవకాశం ఉందా అంటే విశ్లేషకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా మోడీనే చూపిస్తూ ప్రచారానికి వెళుతోంది భారత జనతా పార్టీ. ఇదిలా ఉంచితే అసలు 400 సీట్లు ఎందుకు అనే దానిపై ప్రధాని మోడీ క్లారిటీ ఇచ్చారు. కర్నాటకలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ ‘ అభివృద్ధి, అవినీతి విముక్త భారత్ కోసమే 400 సీట్లు బీజేపీ అడుగుతోందని ‘ చెప్పుకొచ్చారు. మరోసారి ఎన్డీయేకు అధికారాన్ని కట్టబెడితే దేశాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం అంటూ మోడీ చెప్పుకొచ్చారు.

అయితే అటు ఇండియా కూటమి కూడా అధికారం కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ చేస్తున్న యాత్రలతో కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ లభించింది. దీంతో ఈసారి హస్తం పార్టీకి కూడా సీట్ల మెజారిటీ పెరిగే అవకాశం లేకపోలేదు. మరి ఇండియా కూటమిని తక్కువ సీట్లకు పరిమితం చేసి మోడీ అనుకున్న లక్ష్యాన్ని చెరుకుంటారా అంటే కొంతమంది అవుననే సమాధానం ఇస్తున్నారు. ఎందుకంటే 2014, 2019 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 300 పైగా సీట్లు సాధించింది. దాంతో ప్రస్తుతం మోడీ పై ఉన్న సానుకూలత కారణంగా ఈసారి సీట్లు పెరిగే అవకాశం లేకపోలేదు. అలా చూస్తే కమలనాథులు నిర్దేశించుకున్న 400 సాధించడం పెద్ద కష్టమేమీ కదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Also Read:KCR:దళిత,బహెజనులు ఏకంకావాలి

- Advertisement -