మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా విపక్ష ఇండియా కూటమి లోక్ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా అవిశ్వాస తీర్మానం పై చర్చ జరుగుతూనే ఉంది. మణిపూర్ అల్లర్ల విషయంలో మోడీ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టేందుకు విపక్షలు అధిష్టానంపై అడుగులు వేశాయి. సభలో సంఖ్య బలం ఎన్డీయే కూటమికే ఎక్కువగా ఉన్నప్పటికి, అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని తెలిసినప్పటికి అవిశ్వాసానికి మొగ్గు చూపాయి విపక్షాలు. అయితే ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోయినప్పటికి అది విపక్షలకు అనుకూలమే అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో సరిగ్గా ఎన్నికల ముందు మోడీ సర్కార్ ను వేలెత్తి చూపే అవకాశం విపక్షలకు దక్కింది.
ముఖ్యంగా మణిపూర్ విషయంలో ఇప్పటికే మోడీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ప్రజావ్యతిరేకత ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం ద్వారా మోడీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రశ్నలు ఎక్కుబెట్టవచ్చనే ఉద్దేశంలో విపక్ష పార్టీలు ఉన్నాయి. ఇక ఇప్పటికే అవిశ్వాస తీర్మాన చర్చలో మోడీ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తూ బీజేపీ నేతలను ఇరుకున పెడుతున్నారు విపక్ష నేతలు. ఇటు బీజేపీ నేతలు మణిపూర్ విషయంలో సమాధానం చెప్పలేక దాటవేసే దొరణిని అవలంభిస్తున్నారు. కాగా గత రెండు రెండు రోజులుగా అవిశ్వాస తీర్మానం చర్చలో పాల్గొనని ప్రధాని మోడీ ని ఉద్దేశించి చర్చలో పాల్గొనాలని విపక్ష నేతలు గట్టిగానే డిమాండ్ వినిపించారు.
Also Read:Kavitha:ఎంపీగా పోటీ చేస్తా..గెలిచి చూపిస్తా
తాజాగా చర్చల పాల్గొన్న ప్రధాని అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టినందుకు విపక్షలకు దాన్యవాదాలు తెలిపారు. 2019 లో కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారని ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిందని మళ్ళీ ఈ ఏడాది ఎన్నికల ముందు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారని.. అందువల్ల 2024 ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధిచబోతున్నట్లు తెలుస్తోంది అని మోడీ తనదైన రీతిలో వ్యాఖ్యానించారు. అయితే గతంలో మాదిరి ఈసారి కూడా అవిశ్వాస తీర్మానం మోడీ సర్కార్ కు అనుకూలమేనా అంటే చెప్పలేని పరిస్థితి. ఈసారి బీజేపీ నేతలు భావిస్తున్నట్లుగా ఆ పార్టీకి విజయం అంతా సులువైన విషయం కాదనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట. 2019 తరువాత జరిగిన చాలా పరిణామాలు ఈసారి ఎన్నికల్లో మోడీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు. మరి ఏం ఈసారి ఎన్నిక్కల్లో మోడీకి దేశ ప్రజలు ఎలాంటి ఫలితాన్ని కట్టబెడతారో చూడాలి.
Also Read:KTR:మెట్రో సామర్థ్యాన్ని రెట్టింపు చేయండి