Kavitha:ఎంపీగా పోటీ చేస్తా..గెలిచి చూపిస్తా

39
- Advertisement -

నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తా…గెలిచి చూపిస్తానని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడిన కవిత…నిజామాబాద్ రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా మారిందన్నారు. బీజేపీ ఎంపీలకు దమ్ముంటే కేంద్రం నుండి నిధులు తేవాలన్నారు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ఒక్క సీటు రాదన్నారు.

నిజామాబాద్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు కేటాయించిందని…. ఎంపీ బండి సంజయ్ లోక్ సభలో పచ్చి అబద్దాలు మాట్లాడరన్నారు. ఆయన నోటి నుండి ఒక్క మంచి మాట రాదు…మంచి పని చేయడని మండిపడ్డారు. బండి సంజయ్ ఎక్కడ పోటీచేసినా ఓడిస్తామని..24 గంటల కరెంట్ ఎక్కడ వస్తుందో తెలియాంటే సంజయ్ కరెంట్ వైర్లు ముట్టుకోవాలని ఎద్దేవా చేశారు.

ఎన్నికల కమిషనర్ ఎంపికలోనూ మోడీ సర్కార్ రాజకీయం చేస్తుందన్నారు.నిజామాబాద్ ఐటీ టవర్‌తో యువతలో కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. సొంత పార్టీ నేతలనే సంజయ్ మోసం చేస్తున్నారన్నారు.బీఆర్ఎస్‌కు సీఎం కేసీఆర్ చాలు…ప్రశాంత్ కిశోర్‌లు అవసరం లేదన్నారు. తమకు పోటీ కాంగ్రెస్‌తోనే అని చెప్పిన కవిత…ఆ పార్టీ కంటే 20 శాతం ముందున్నామని చెప్పారు. బండి సంజయ్‌కి ఏం తెలియదు…ఎవరైనా చెబితే వినాలని సూచించారు.

Also Read:చంద్రబాబుకు జనసేన దెబ్బ!

- Advertisement -