పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా సోమవారం బారక్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ ఎన్నికల్లో బెంగాల్‌లో తనకు ఇదే చివరి ర్యాలీ అని ప్రధాని ప్రకటించారు. మే 2న జరిగే రెండో దశ పోలింగ్‌కు ముందు ఆయన తన ప్రచారాన్ని ముగించారు. ఈ ఎన్నికల్లో ఇదే నా చివరి ర్యాలీ. మే 4న ఫలితాలు వెలువడిన తర్వాత జరిగే బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి నేను తప్పకుండా వస్తాననే నమ్మకంతో వెళ్తున్నాను అని మోదీ పేర్కొన్నారు.
హెలిప్యాడ్ నుండి సభా ప్రాంగణం వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర దారికి ఇరువైపులా వేలాది మంది ప్రజలు ఉదయాన్నే తరలివచ్చి తనకు ఆశీస్సులు అందజేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 23న జరిగిన మొదటి దశ ఎన్నికల్లో బెంగాల్ చరిత్రలోనే అత్యధికంగా 93.19 శాతం ఓటింగ్ నమోదు కావడం పట్ల ఎన్నికల కమిషన్ సంతోషం వ్యక్తం చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.
Also Read:సామాన్యురాలిలా కూరగాయలు కొన్న దీదీ!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుండగా మే 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.

