ట్రంప్ టారీఫ్‌..మోదీ రియాక్షన్

9
- Advertisement -

అనుకున్నట్లుగానే బాంబ్ పేల్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్‌పై పన్నుల భారం పెంచుతూ ప్రకటన చేశారు. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు భారత్‌పై 25 శాతం అదనంగా సుంకాలు విధిస్తున్నట్లు తెలిపారు.

భారత్‌పై మొత్తం 50 శాతం సుంకాలు పెంచగా ఈ మేరకు టారిఫ్ ఫైల్ పై సంతకం చేశారు ట్రంప్. నేటి నుంచి 25 శాతం సుంకాల పెంపు అమల్లోకి రానుండగా భవిష్యత్తులో మరింతగా సుంకాలు పెంచుతామని తెలిపారు ట్రంప్.

ట్రంప్ టారిఫ్ లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల ప్రయోజనాలు కాపాడటంలో భారత్ రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పరోక్షంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలపై స్పందించారు.

Also Read:బనకచర్ల కోసమే కాళేశ్వరంపై కుట్ర!

- Advertisement -