బనకచర్ల కోసమే కాళేశ్వరంపై కుట్ర!

12
- Advertisement -

బనకచర్ల కోసమే కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి కుట్రచేశారని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూర్ (ఎస్) మండలంలో మీడియా తో మాట్లాడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి…. బనకచర్ల కోసమే కాళేశ్వరంను పండబెట్టిండ్రు, ఇది ముమ్మాటికీ చంద్రబాబు కుట్రే అన్నారు.

కాళేశ్వరం రిపోర్ట్ కాదు, అది కాంగ్రెస్ రిపోర్ట్… బీజేపీ, కాంగ్రెస్, చంద్రబాబు ప్రోద్బలంతో తయారు చేసిన రిపోర్ట్ మాత్రమే..అందుకే అది కాళేశ్వరం రిపోర్టు కాదు.. కాకరకాయ, కొత్తిమీర కట్ట కాదు అన్నారు. రెండేళ్లుగా చెప్పిందే చెప్పి, కేసీఆర్ పై ఏడుపు తప్ప ఒరగబెట్టిందేమీ లేదు.. మోడీ, చంద్రబాబు డైరెక్షన్‌లో కేసీఆర్‌ను బదనాం చేయాలని కుట్రలు చేస్తున్నారు… ఎవరెన్ని కుట్రలు చేసినా కేసీఆర్‌ను ఏం చేయలేరు అన్నారు. కేసీఆర్ ముందుచూపు పాలనే తెలంగాణలో నేడు అద్భుత ఫలితాలు… ఆయన పెట్టిన అద్భుత పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి అన్నారు.

కాళేశ్వరమే ఎప్పటికైనా తెలంగాణకు జీవధార.. కేసీఆర్‌కు మరింత పేరొస్తుందనే కాంగ్రెస్ విషం కక్కుతోంది, కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలతో ఇంకా కాలం వెళ్లబుచ్చుతోంది… నేనే స్వయంగా వెళ్లొచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన… నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో హరీష్ రావు నిజాలన్నీ చెప్పిండు…అయినా కూడా కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేయడానికి సిగ్గుండాలి అన్నారు. వరుస మోసాలతో కాంగ్రెస్ రికార్డులు సృష్టిస్తోంది… ఇవన్నీ స్థానిక సంస్థల ఎన్నికల స్టంట్‌లలో భాగమే…బీసీలను వాడుకుని మోసం చేసేందుకే రిజర్వేషన్ డ్రామాలు అన్నారు. ప్రజా సంక్షేమంలో కేసీఆర్‌ను మించినోడే లేడు… ఢిల్లీ జంతర్ మంతర్ నాటకం కూడా బీసీలను మోసం చేసేందుకే…. రేవంత్ ఎప్పటికీ మోడీ, చంద్రబాబుల చేతిలో కీలుబొమ్మే… తెలంగాణ నీళ్లను బనకచర్ల రూపంలో ఆంధ్రకు దోచిపెట్టే కుట్ర చేస్తున్నారు… ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, రేవంత్… నిజాలు మాట్లాడితే భయపడుతున్నారు అన్నారు.

Also Read:జైశంకర్‌కు సీఎం స్టాలిన్ లేఖ

- Advertisement -