కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ప్రమాదంలో ప్రాణనష్టం, ఆస్తి నష్టం చాలా బాధ కలిగించింది అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మరణించిన ప్రతి ఒక్కరి బంధువులకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
గాయపడిన వారికి రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కర్నూలు బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ప్రమాద ఘటనలో భారీ ప్రాణ నష్టం చాలా బాధించింది… మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం చెప్పారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను… ఇలాంటి పునరావృత ప్రమాదాలు మన ప్రజా రవాణా వ్యవస్థల భద్రత గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.. ప్రయాణీకుల భద్రత అత్యంత ప్రాధాన్యత, మరియు వాహన నిర్వహణ బాధ్యతతో పాటు ఈ ప్రమాదాలకు జవాబుదారీతనం నిర్ధారించడం చాలా అవసరం అన్నారు రాహుల్.
కర్నూలు బస్సు దుర్ఘటన తీవ్రంగా కలిచివేసింది అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మృతుల కుటంబాలకు ప్రగాఢ సంతాపం… క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం తరపున సూచించాను… భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా ప్రమాణాలు ఉండేలా రవాణా శాఖ చర్యలు చేపట్టాలి అన్నారు.
Also Read:కర్నూల్‌లో ఘోర ప్రమాదం.. బస్సు దగ్ధం

