బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు కర్నూల్ జిల్లా కలెక్టర్ ఏ సిరి తెలిపారు. కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నెంబర్ 08518-277305… కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నెంబర్ 9121101059 అని చెప్పారు.
ఘటనా స్థలి వద్ద కంట్రోల్ రూమ్ నెంబర్ 9121101061 కాగా కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 9121101075 అని తెలిపారు. కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నెంబర్లు: 9494609814, 9052951010 అని.. బాధిత కుటుంబాలు పై నెంబర్లకు ఫోన్ చేసి వివరాలకు సంప్రదించవచ్చు అని కర్నూల్ కలెక్టర్ తెలిపారు.
కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద బెంగుళూరు నుంచి హైద్రాబాద్ వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో 40 మంది ప్రయాణీకులు ఉండగా అత్యవసర ద్వారం పగలగొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డ 12 మంది ప్రయాణికులు బయటపడ్డారు. 20 మంది మృతి చెందారు. ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోగా నిబంధనలకు విరుద్ధంగా వి.కావేరి ట్రావెల్స్ ఈ బస్సును నడుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సుకు ఫిట్‌నెస్ గడువు ముగిసింది.
Also Read:కర్నూలు ప్రమాదం..కేసీఆర్,కేటీఆర్ దిగ్భ్రాంతి

