వాజ్‌పేయీకి ప్రముఖుల నివాళి..

169

నేడు అటల్‌ బిహారి వాజ్‌పేయి అంత్య్రక్రియలు కావడంతో ఆయన పార్థివదేహాన్ని చూసేందుకు వివిధ రంగాల ప్రముఖులు తరలివస్తున్నారు. గురువారం సాయంత్రం 05:05 గంటలకు వాజ్‌ పేయి తుదిశ్వాస విడిచినట్లు ఎయిమ్స్‌ వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే.  దేశానికి ఎనలేని సేవలందించిన మహానేతకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో వాజ్‌పేయి బౌతిక కాయానికి ప్రధాని మోదీ, రాజ్‌ నాథ్‌సింగ్‌ , అమిత్ షా నివాళులర్పించారు.

Rahul Gandhi

కాగా.. రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్లు పి.సదాశివం, భన్వరీలాల్‌ పురోహిత్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, నేవీ చీఫ్‌ సునీల్‌ లాంబా, ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తదితరులు మాజీ ప్రధానికి నివాళులర్పించారు. మధ్యాహ్నం 1:30 గంటలకు వాజ్‌పేయి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.modi, Rahul Gandhi In Tribute To Atal Bihari Vajpayee

..