ఆది హీరోగా ‘బుర్ర కథ’ ప్రారంభం..!

306
Burra Katha Launch Event
- Advertisement -

రచయితగా మంచి పేరు సంపాదించుకున్న డైమండ్ రత్నబాబు తొలిసారి డైరెక్టరగా రాబోతున్నారు.. శుక్రవారం లాంచ్ అయిన ఈ సినిమాలో యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్నారు..’ బుర్రకథ ‘ అనేది సినిమా టైటిల్.. టాలీవుడ్‌లోని ప్రముఖ రచయితలు ఈ సినిమా ఓపెనింగ్‌కి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.. ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ సినిమాలోని హీరో ఫస్ట్ సీన్‌కి క్లాప్‌ని అందించగా , లిరిసిస్ట్ , రచయిత అయిన శివ శక్తి దత్తా కెమెరా స్విచ్ ఆన్ చేసారు..

Burra Katha Launch Event

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు డైమండ్ రత్న బాబు మాట్లాడుతూ, ఈ రోజు చాల హ్యాపీగా ఉంది.. ఎందుకంటే నా తోటి రచయితలు, పెద్దలు ఈ సినిమా ఓపెనింగ్ వచ్చి డైరెక్టర్‌గా తొలి చిత్రం చేస్తున్న నన్ను ఆశీర్వదించినందుకు.. అలాగే ఈ సందర్భంగా నా ప్రొడ్యూసర్స్‌కి థాంక్స్ చెప్తున్నాను.. నాకు టాప్ టెక్నిషియన్స్‌ని ఇచ్చి సపోర్ట్ చేసినందుకు.. కథ చెప్పిన వెంటనే సినిమాని ఓకే చేసి నాపై నమ్మకం ఉంచిన హీరో ఆది సాయి కుమార్‌కి కృతజ్ఞతలు.. ఈ సినిమా ద్వారా స్క్రీన్ ప్లే రైటర్స్‌ని పరిచయం చేస్తున్నాను.. వారికి ఈ సినిమా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను.. అన్నారు..

రచయిత శివ శక్తి దత్త మాట్లాడుతూ, ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది.. ఈ సినిమాలో ఒక పాట రాస్తున్నాను.. ఈ సినిమా సక్సెస్ అయ్యి చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.. అన్నారు..

Burra Katha Launch Event

హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాల థాంక్స్.. ఈ సంవత్సరంలో ఇది నా మూడో సినిమా.. ఈ మూడు సినిమాలు నాకు ఎంతో ఎక్జాయిటింగ్ గా ఉన్నాయి.. ముఖ్యంగా ఈ సినిమా చేయడం ఎంతో థ్రిల్ గా ఉంది.. రత్నబాబు గారు మంచి ఫ్రెష్ లైన్ తో వచ్చారు.. ఇందులో నా పాత్ర డిఫరెంట్ గా చాల బాగుంది.. టాప్ టెక్నిషియన్స్ తో ఈ సినిమా చేయడం ఎంతో హ్యాపీ గా ఉంది.. అన్నారు..

నిర్మాత శ్రీకాంత్ దీపాల మాట్లాడుతూ.. మా బ్యానర్ లో ఇది రెండో సినిమా.. బుర్రకథ తప్పకుండ ఓ మంచి సినిమా అవుతుంది.. డెఫినెట్లీ ఈ సినిమా ద్వారా మా బ్యానర్ కి మంచి పేరొస్తుంది.. రేపటినుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.. ఇంకో వారంలో సినిమా కి సంబంధించిన హీరోయిన్స్, ఇతర నటీనటులు కన్ ఫర్మ్ అవుతారు.. అన్నారు..

Burra Katha Launch Event

నటీనటులు: ఆది సాయికుమార్, రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణ మురళి, పృథ్వి రాజ్, గాయత్రీ గుప్తా.. సాంకేతిక నిపుణులు :కథ, సంభాషణలు మరియు దర్శకత్వం: ‘డైమండ్’ రత్న బాబు, నిర్మాత: హెచ్ కె శ్రీకాంత్ దీపాల, బ్యానర్: దీపాల ఆర్ట్స్, సంగీతం: సాయి కార్తీక్, డీఓపీ : రామ్ ప్రసాద్, ఎడిటర్ : ఎం.ఆర్ వర్మ, ఆర్ట్ డైరెక్టర్: చిన్నా, స్క్రీన్ ప్లే: ఎస్ కిరణ్, ప్రసాద్ కామినేని, సురేష్, దివ్య భావన బండ్ల మరియు సయీద్ తాజుద్దీన్, ఫైట్స్ : వెంకట్, సాహిత్యం: శివ శక్తి దత్తా, రామజోగయ్య శాస్త్రి, భాస్కర్ భట్ల, శ్రీ మణి, శ్రేష్ఠ, క్రియేటివ్ హెడ్: ANV గణేష్.

- Advertisement -