2024 సార్వత్రిక ఎన్నికలకు ఎంతో సమయం లేదు. కేవలం 8 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాలపై అందరి దృష్టి నెలకొంది. మూడోసారి కూడా అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుంటే.. ఈసారి బీజేపీ దూకుడుకి బ్రేకులు వేయాలని కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటికే మోడీని గద్దె దించే లక్ష్యంతో విపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇకపోతే గతంతో పోల్చితే ఈసారి మోడీ సర్కార్ పై కొంత వ్యతిరేకత ఏర్పడిందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. దాంతో ఈసారి బీజేపీకి విజయం కాస్త కష్టమనే భావన ఆ పార్టీ నేతల్లో కూడా ఉందట. .
దాంతో ఈ వ్యతిరేకత ను అధిగమించేందుకు అస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారు కాషాయ పెద్దలు. అందులో భాగంగానే పార్లమెంట్ ను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తున్నారట కాషాయ పెద్దలు. అయితే జమిలి ఎన్నికలపై గత కొన్నాళ్లుగా తరచూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలతో పాటు అన్నీ రాష్ట్రాల ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై మోడీ సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే జమిలి ఎన్నికల విషయంలో అన్నీ రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి.. మరి ఆ విధానానికి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తాయా అనేది కూడా ప్రశ్నార్థకమే.
Also Read:పిక్ టాక్ :హద్దులు దాటిన అందాలండోయ్
దీంతో జమిలి ఎన్నికలు కాకుండా మినీ జమిలి ఎన్నికల రూపంలో కేవలం పార్లమెంట్ ఎన్నికలను మాత్రమే కాస్త ముందు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తోందట మోడీ సర్కార్. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ అయింది. అందులో భాగంగానే ఈ ఏడాది చివర్లో పార్లమెంట్ బరిలో నిలిచే తొలి జాబితా అభ్యర్థులు ప్రకటించేందుకు బీజేపీ అధిస్థానం అడుగులు వేస్తోందట. తొలి జాబితాలో 160 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి.. ఆ తరువాత వచ్చే స్పందనను బట్టి రెండో జాబితాను ఆ వెంటనే విడుదల చేసేందుకు బీజేపీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారట. దీనిపై ఈ వారంలోని పార్టీ కీలక సమావేశం నిర్వహించబోతుందని టాక్. దీంతో మోడీ సర్కార్ ఓటమి భయంతోనే ముందుస్తు ఎన్నికల వైపు అడుగులు వేస్తోందా అనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read:రేవంత్ రెడ్డికి మళ్ళీ ఓటమి తప్పదా?