మోడీతో జగన్.. ఏం మాట్లాడారో ?

19
- Advertisement -

ఏపీ రాజకీయాల్లో రోజుకో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏపీలోని ప్రధాన పార్టీలు కేంద్రానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుండడం కొత్త చర్చలకు తావిస్తోంది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రంలోని బీజేపీ అగ్రనేతలతో భేటీ అయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ప్రయాణం ముగియగానే పవన్ కూడా డిల్లీ వెళ్లారు. అయితే పవన్ చంద్రబాబు బీజేపీని కలుపుకునే ప్రయత్నంలో డిల్లీ వెళ్ళినట్లు టాక్ వినిపించింది. మరి ఇంతలోనే ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి కూడా డిల్లీ వెళ్ళడం ఆసక్తిని రేపుతోంది. ఏపీలోని ప్రధాన పార్టీల అధినేతలు వరుసగా డిల్లీకి ఎందుకు పయణమౌతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే చంద్రబాబు, పవన్ ఇద్దరు అమిత్ షా, నడ్డా లను కలిస్తే.. జగన్ మాత్రం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. .

దీంతో ఇంత సడన్ గా ప్రధాని మోడీని జగన్ భేటీ కావల్సిన అవసరత ఏముందని సందేహాలు చాలామందిలో వ్యక్తమౌతున్నాయి. ఈ భేటీ రాజకీయ లభ్ది కోసమా ? రాష్ట్ర ప్రయోజనాల కోసమా ? అనే గుసగుసలు జరుతున్నాయి. అయితే రాష్ట్రానికి రావలసిన నిధుల విషయంలో చర్చించేందుకే ప్రధాని మోడీతో సి‌ఎం జగన్ భేటీ అయ్యారని వైసీపీ క్యాంప్ నుంచి వినిపిస్తున్న మాట.

ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు, పెండింగ్ లో ఉన్న బకాయిలు, ప్రత్యేక హోదా అంశం, పోలవరం ప్రాజెక్టు నిధులు, విద్యుత్ బకాయిలు.. ఇలా చాలా అంశాలను ప్రధాని మోడీ ముందు ప్రస్తావించినట్లు వినికిడి. అయితే గత కొన్నాళ్లుగా కేంద్ర పెద్దలతో అంటిఅంటనట్టుగా వ్యవహరిస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి సడన్ గా డిల్లీ వెళ్ళడం.. అదికూడా పవన్, చంద్రబాబు డిల్లీ టూర్ తర్వాత జరగడం.. వంటి పరిణామాలను చూస్తే జగన్ డిల్లీ ప్రయాణం వెనుక రాజకీయ కోణం కూడా ఉండే అవకాశం ఉందని కొందరి అభిప్రాయం. మరి జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీతో ఏం చర్చలు జరిపారు ? కేవలం రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలోనే చర్చించారా ? లేదా ఇంకేమైనా ఉందా ? అనే ప్రశ్నలకు ముందు రోజుల్లో సమాధానం దొరికే అవకాశం ఉంది.

Also Read:Congress:ఆటో డ్రైవర్లను ఆదుకునేదెప్పుడు?

- Advertisement -