మోడీ మళ్లీ గెలవాలంటున్న హీరోయిన్..

240
kangana raonath
- Advertisement -

ప్రధాన మంత్రి నరేంద్రమోడీమే మళ్లీ ప్రధాన మంత్రి కావాలని అంటుంది బాలీవుడ్ హీరోయిన్ కంగనా రౌనత్. మోడీ ప్రధాన మంత్రి పదవికి తగిన వ్యక్తి అని ప్రశంసలు కురిపిస్తుంది. ఆయన పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని..మరో ఐదేళ్ల పాటు ఆయన ప్రధానమంత్రిగా కొనసాగాలని నేను కొరుకుంటున్నానని తెలిపారు. ప్రధాని మోడీని పొగుడుతూ ఈఅమ్మడు చేసిన వ్యాఖ్యలతో బాలీవుడ్ లో పెద్ద చర్చే నడుస్తుంది.

kangana, modi

మోడీ ఎటువంటి అండదండలు లేకుండా రాజకీయాల్లోకి వచ్చి ఇంత పెద్ద పదవి స్వీకరించారని..ఆయన స్వయం కృషితో ఇంత పెద్ద స్ధాయికి ఎదిగారన్నారు. ఇన్ డైరెక్ట గా రాహుల్ గాంధీపై పంచులు వేసింది ఈ బాలీవుడ్ భామ. తల్లి తండ్రులను అడ్డం పెట్టుకుని మోడీ రాజకీయాల్లోకి రాలేదన్నారు. కంగనా చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే రాజకీయాల్లోకి రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో బిజెపి తరపునుంచి కొంత మంది సెలబ్రెటీలను బరిలోకి దింపనున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కంగనా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ ప్రముఖులు.

- Advertisement -