పటేల్‌ కృషితో ఏక్‌ భారత్‌..శ్రేష్ఠ్‌ భారత్‌:మోడీ

269
modi sardar statue
- Advertisement -

భవిష్యత్‌ తరాలకు ప్రేరణ కోసమే సర్దార్ వల్లభాయ్‌ పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ 143వ జయంతి సందర్భంగా పటేల్‌ భారీ విగ్రహాన్ని ప్రధాని మోడీ గుజరాత్‌లోని కేవడియాలో జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ భారత సమగ్రతకు పటేల్ విగ్రహాం ఒక చిహ్నమని తెలిపారు.

పటేల్ జయంతి భారత్ ఏక్తా దివాస్ అని తెలిపారు. పటేల్ విగ్రహావిష్కరణ తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు మోడీ. దేశమంతా పటేల్‌కు ఘనంగా నివాళి అర్పిస్తున్నానని చెప్పారు. వందల సంస్థానాలను ఏకం చేసిన ఘనత పటేల్‌ది అన్నారు.భారత్ ఐక్యంగా ఉందంటే అది పటేల్ చొరవే అన్నారు. దేశ సమగ్రతే శ్వాసగా బ్రతికిన పటేల్‌కు శతకోటి వందనాలు అని వెల్లడించారు.

పటేల్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు మోడీ. సీఎంగా ఉన్నప్పటి నా కల ప్రధానిగా నెరవేరిందన్నారు. కౌటిల్యుడి వ్యూహం,శివాజీ శౌర్య ప్రతాపం కలగలిపిన వ్యక్తి పటేల్‌ అని కొనియాడారు. 33 నెలల్లో విగ్రహాన్ని ప్రతిష్టించామని చెప్పారు. ఈరోజును ఏ భారతీయుడు మర్చిపోలేడని చెప్పారు. ఏక్ భారత్…శ్రేష్ట్ భారత్ నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. వల్లభాయ్ వేసిన అడుగులతోనే భారత్ ముందుకు వెళుతోందన్నారు. పటేల్‌కు నివాళిగా దేశమంతా రన్‌ ఫర్ యూనిటీని నిర్వహించారని తెలిపారు.

- Advertisement -