కరోనా సెకండ్ వేవ్‌తో దేశ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓ వైపు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోవడం మరోవైపు ఆక్సిజన్ కొరతతో రోజుకు రికార్డు స్ధాయిలో మరణాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.ఇక కరోనా కట్టడిలో విఫలమైన మోదీ సర్కార్‌పై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ తరుణంలో గ్లోబల్ లీడర్‌గా ప్రధాని మోదీ రేటింగ్ అత్యంత కనిష్టానికి పడిపోయింది. ఈ విషయాన్ని ఆమెరికాకు చెందిన ఒక సర్వే సంస్థ తన నివేదిక స్పష్టం చేసింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 2.5 కోట్లు దాటడంతో ఆయన ప్రతిష్టను మసకబారేలా చేసిందన్నారు.
కరోనా కట్టడి కోసం సన్నద్ధమవడంలో మోదీ ప్రభుత్వం విఫలం కావడంవల్లే మహమ్మారి వేగంగా విస్తరించిందని విమర్శలు వెల్లువెతున్నాయి.ఈ వారం ప్రధాని మోదీ ఓవరాల్ రేటింగ్ 63 శాతానికి పడిపోయింది. ప్రధాని మోదీ పాపులారిటీని ట్రాక్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇదే అత్యంత కనిష్ట రేటింగ్ అని ఆమెరికా రేటింగ్ సంస్థ స్పష్టం చేసింది.
ఇక దేశంలో పలు సంస్థలు నిర్వహించిన సర్వేలో కూడా ఇదే విషయం తేటతెల్లమైంది. 60 శాతం మంది భారతీయులు …మోదీ పనితీరును తప్పుబట్టగా సోషల్ మీడియాలో రిజైన్ మోదీ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది.