కరోనా ఎఫెక్ట్…నిరుద్యోగ భారతం

62
covid india

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాలుస్తోంది. కరోనాను కట్టడికి చేసేందుకు ఇప్పటికే దేశంలో మెజార్టీ రాష్ట్రాలు లాక్ డౌన్ బాటపట్టగా వలస కార్మికులు తమ సొంత ఊళ్లకు పయనమయ్యారు. ఇక లాక్ డౌన్‌తో దేశ‌వ్యాప్తంగా రోజురోజుకు ఉపాధి కోల్పోతున్న‌ వారి సంఖ్య అధికం కాగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారీ సంఖ్య‌లో ప్ర‌జలు నిరుద్యోగులుగా మారుతున్నారు.

ఈ నేపథ్యంలో దేశంలో నిరుద్యోగ సమస్యపై సెంట‌ర్ ఫ‌ర్ మానిట‌రింగ్ ఇండియ‌న్ ఎకాన‌మీ (సీఎంఐఈ) ఆసక్తికర విషయాలను వెల్లడించింది. గ్రామీణ భార‌తంలో మే 16తో ముగిసిన వారంలో నిరుద్యోగ‌ల సంఖ్య రెండిత‌ల‌య్యింద‌ని తెలిపింది. మే 9 నాటికి గ్రామీణ నిరుద్యోగుల సంఖ్య 7.29గా ఉండ‌గా 16 నాటికి అది 14.34 శాతానికి పెరిగింద‌ని సీఎంఐఈ పేర్కొంది.

పట్టణ ప్రాంతాల్లో 14.7 శాతానికి పెరిగగా స‌రాస‌రి నిరుద్యోగిత 8.76 శాతం నుంచి 14.45 శాతానికి చేరింద‌ని పేర్కొంది. లాక్‌డౌన్‌ల‌తో ఆర్థిక కార్య‌క‌లాపాలు నిలిచిపోవ‌డమే దీనికి కార‌ణమ‌ని అభిప్రాయ‌ప‌డింది.