- Advertisement -
మరో సంచలన నిర్ణయం దిశగా మోడీ సర్కార్ అడుగులు వేస్తోంది. అక్రమంగా బంగారం దాచేవారిపై భారీ జరిమానా విధించేందుకు సిద్ధమవుతోంది.రశీదులు లేని బంగారంపై పన్ను చెల్లించేలా కొత్తగా గోల్డ్ ఆమ్నెస్టీ స్కీమ్‌ను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.
గోల్డ్ ఆమ్నెస్టీ స్కీమ్ నిర్దేశిత కాలం వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఈ కాలంలో బంగారం వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. దీంతో జరిమానాతో బయటపడొచ్చు. అదే స్కీమ్ కాలం ముగిసిన తర్వాత రశీదులేని బంగారం మీ వద్ద బయటపడితే కఠిన చర్యలు తీసుకుంటారు. ఇందుకు సంబంధించిన వార్తలు జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ స్కీమ్ అమలులోకి వస్తే నల్ల ధనాన్ని అరికట్టేందుకు మోడీ సర్కార్ తీసుకున్న రెండో అతిపెద్ద నిర్ణయం ఇదే అవుతుంది.
- Advertisement -