భారత విద్యార్థులను రప్పించడంలో మోదీ ఫెయిల్.?

116
modi
- Advertisement -

ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు పెను విధ్వంసానికి దిగాయి. గత ఏడు రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు గ్యాప్‌ లేకుండా విరుచుకుపడుతున్నాయి. ఎనిమిదవ రోజు సైతం విధ్వంసకాండ కొనసాగుతుండగా.. బెలారస్‌ బ్రెస్ట్‌ ప్రాంతంలో చర్చలు జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. రష్యా తరపున సైనికులు, ఉక్రెయిన్‌ తరపున సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా భారీ సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ప్రధాన పట్టణాలపై ఫోకస్‌ చేసిన రష్యన్‌ బలగాలు ఖార్కీవ్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు యుద్ధంతో ఏడు లక్షల మంది దేశం విడిచి పారిపోతున్నారు. అయితే రష్యా ఉక్రెయిన్‌ యుద్ధంతో ఉక్రెయిన్‌లో ఉన్న భారత విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇప్పటికే కొంత మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి రాగా మరికొంత మంది ఉక్రెయిన్ లో చిక్కుకుపోయి యుద్ధ భూమిలో బాంబుల మోతలతో బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. అయితే రష్యా – ఉక్రెయిన్‌ దేశాల మద్య గత కొన్ని రోజులుగా యుద్ధం జరుగొచ్చని భావించిన ఇతర దేశాలు ఉక్రెయిన్‌లో ఉన్న తమ దేశ ప్రజలను సురక్షితంగా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుని పౌరులను తమ దేశానికి సురక్షితంగా చేర్చారు. కానీ భారతదేశ పౌరులను ఇండియాకు తరలించడంలో భారత ప్రభుత్వం వేగంగా చొరవ చూపలేదనే విమర్శలు వస్తున్నాయి. యుద్ధంపై సరైన సమయంలో భారత ప్రభుత్వం సరైన రీతిలో చర్యలు తీసుకోలేదని, భారత విద్యార్థులను వేగవంతంగా ఇండియాకు రప్పించడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం తారాస్థాయికి చేరకున్నాక, ఉక్రెయిన్‌లో భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత జరగాల్సిన నష్టం జరిగాక మోదీ ప్రభుత్వం మెల్లగా నిద్రలేచి నష్టనివారణ చర్యలకు పూనుకున్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధం నేపథ్యంలో భారత ప్రభుత్వం ముందుగా పసిగట్టి ముందు చూపు చర్యలతో స్పందించి ఉంటే ఉక్రెయిన్‌లో భారత పౌరులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోయి ఉండేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత పౌరులను స్వదేశానికి చేర్చడంలో భారత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

- Advertisement -