మోడీ రాక.. బీజేపీలో కాక ?

22
- Advertisement -

తెలంగాణ బీజేపీలో గత కొన్నాళ్లుగా అంతర్మథనం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సొంత పార్టీ నేతలే అధిష్టానంపై తీవ్రంగా మండి పడుతున్నారు. బీజేపీ అధిష్టానం కొంతమందికి మాత్రమే పార్టీలో ప్రదాన్యత కలిపిస్తోందని, చాలమందినేతలను పక్కన పెడుతోంద్సాని ఆ పార్టీలోని కొంతమంది సీనియర్ నేతలు అలకబునారు. ముఖ్యంగా రాష్ట్ర బీజేపీ మొత్తం బండి సంజయ్, ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డిల చుట్టూనే తిరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పార్టీకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవలన్న ఈ ముగ్గురే తీసుకుంటున్నారని మిగిలిన నేతలను అసలు పట్టించుకోవడం లేదని కొంతమంది అసంతృప్తితో రగిలిపోతున్నారు. .

ఆ మద్య సీనియర్ నేత వివేక్ ఇంట్లో విజయశాంతి, కొండ విశ్వేశ్వర రెడ్డి మరికొంత మంది భేటీ అయిన సంగతి తెలిసిందే. వీరంతా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక అక్టోబర్ 1 న ప్రధాని మోడీ తెలంగాణకు రానున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి సీనియర్ నేతలంతా అలెర్ట్ అయ్యారట. తాజాగా విజయశాంతి నివాసంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండ విశ్వేశ్వర రెడ్డి, ఏనుగు రవీందర్ వంటి వారు భేటీ అయ్యారు.

వీరంతా కూడా ప్రస్తుతం పార్టీలో చోటు చేసుకున్నా అనిశ్చితి వ్యవహారాన్ని మోడీ ముందుంచే ఆలోచనలో ఉన్నారట. బీజేపీ ఓ ముగ్గిరి చేతుల్లోనే ఉందని, ఇలా అయితే పార్టీలో ఉండడం కష్టమని తెగేసి చెప్పేందుకు సిద్దమైనట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మోడి నుంచి సానుకూల స్పందన వస్తే పార్టీలో కొనసాగే అవకాశం ఉందని, లేదా వారి ఆవేదనను మోడి పట్టించుకోక పోతే వీలైనంత త్వరగా పార్టీ వీడాలని చూస్తున్నారట పలువురు బీజేపీ నేతలు. మరి మోడి రాకతో రాష్ట్ర బీజేపీలో ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Also Read:IND vs AUS : క్లీన్ స్వీప్ చేస్తే సంచలనమే !

- Advertisement -