కొండాకు కాంగ్రెస్ నేతల వార్నింగ్

4
- Advertisement -

ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బీసీ కార్డు అడ్డుపెట్టుకుంటారా ? అని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిలపై కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీ అయితే మీరు చేసిన పాపలు అన్ని పోతాయా ? చెప్పాలన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే పార్టీ చూస్తూ ఊరుకోదు … పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు తప్పవు, సీనియర్ నాయకులు అనే ఇంకితం లేకుండా ఏది పడితే అది మాట్లాడతారా ? చెప్పాలన్నారు.

ఈ పాపాన్ని మోయలేము, దించేయండి అని అధిష్టానానికి కొండా దంపతులను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు రాజేందర్ రెడ్డి. కొండా దంపతులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నివాసంలో భేటీ అయిన కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు భేటీ అయ్యారు.

Also Read:Suriya 45: మాస్ టైటిల్‌..కరుప్పు

- Advertisement -